పెద్దపల్లి/సుల్తానాబాద్/జూలపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ధర్మారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జూలపల్లిలో కాంగ్రెస్ లీడర్ పాటకుల మహేశ్ ఆధ్వర్యంలో ఎంపీ బర్త్ డే కేక్ కట్ చేసి, హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పాలు పంచారు.
స్కూల్‌లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ పూసాల గ్రామంలో ఐఎన్టీయూసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నీరటి శంకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు ఆరెపల్లి రాహుల్, సంపత్, రాజయ్య, రాయలింగు, రెడ్డి అయిలయ్య, శ్రీను, వెంకటేశ్, రవీందర్ రెడ్డి, శంకరయ్య, రాజసంగౌడ్, దేవి కిశోర్, రాజలింగయ్య, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ కార్మికులకు చీరల పంపిణీ
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం పాలకుర్తి మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ తొగరి తిరుపతి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ జీపీల్లో పనిచేస్తున్న 25 మంది శానిటేషన్ కార్మికులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడర్లు లక్ష్మణ్‌రావు, శివ, అంజినాయక్, సమ్మయ్య, నర్ర శివనాయక్ పాల్గొన్నారు.
