ఐర్లాండ్ మంత్రం జపిస్తున్న భారతీయులు

ఐర్లాండ్ మంత్రం జపిస్తున్న భారతీయులు

ఎప్పుడూ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌‌‌‌ పోతామనే ఇండియన్లు ఇప్పుడు ఐర్లాండ్‌‌‌‌ బాట పడుతున్నారు. ఆ దేశ పౌరసత్వం కోసం తహతహలాడుతున్నారు. అంతగా ఏముంది ఆ దేశంలో? ఈజీగా పని దొరుకుతుందా? శాలరీలు ఎక్కువా? లేక ప్రశాంతంగా బతకొచ్చా? అనుకుంటున్నారా?
ఇవేం కాదు. అక్కడ సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ దొరికితే అన్ని యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ దేశాలకు వీసా లేకుండా ఈజీగా వెళ్లొచ్చు. వీసా పనంటూ లేకుండా యూకేలో ఉండొచ్చు. పని చేసుకోవచ్చు. అందుకే మనోళ్లు ఐర్లాండ్‌‌‌‌ మంత్రం జపిస్తున్నారు.

ఎందుకిలా వీసా ఫ్రీ ఎంట్రీ?

ఐర్లాండ్‌‌‌‌, బ్రిటన్​ మధ్య కామన్‌‌‌‌ ట్రావెల్‌‌‌‌ ఏరియా అగ్రిమెంట్‌‌‌‌ ఉంది. దీని ప్రకారం వీసా లేకుండా ఐర్లాండ్‌‌‌‌ నుంచి బ్రిటన్​ వెళ్లొచ్చు. పైగా ప్రపంచంలో ఐర్లాండ్‌‌‌‌ సిటిజన్లకు మాత్రమే అన్ని ఈయూ దేశాలు, బ్రిటన్​కు వీసా లేకుండా ఈజీగా వెళ్లే వెసులుబాటుంది. అందుకే ఇండియన్లు ఎక్కువగా ఐర్లాండ్‌‌‌‌కు వెళ్లాలనుకుంటున్నారని ఐరిష్‌‌‌‌ డయాస్పోరా లోన్‌‌‌‌ ఫండ్‌‌‌‌ చీఫ్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఆండ్రూ పరిష్‌‌‌‌ అన్నారు. ఐర్లాండ్‌‌‌‌కు వచ్చిన జనం ఐదేళ్ల తర్వాత సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ కోసం అప్లై చేసుకోవచ్చు. 2018లో 8,225 మందికి సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ ఇవ్వగా ఇందులో ఇండియన్ల సంఖ్య 629. అంతకు ముందు ఏడాది 665 మందికి పౌరసత్వం ఇచ్చారు.

వర్క్‌‌‌‌ పర్మిట్లలో మనోళ్లే టాప్

ఐరిష్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం ఆదేశం ఈయూ నుంచి 50 శాతం మందిని పనిలోకి తీసుకోవాలి. యూరోపియన్‌‌‌‌ ఎకనామిక్‌‌‌‌ ఏరియా (ఈఈఏ)లో భాగస్వామి కాని దేశస్థులు ఐర్లాండ్‌‌‌‌లో పని చేయాలంటే నాన్‌‌‌‌ ఈఈఏ పర్మిట్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాల్లో ఇండియన్లు ముందున్నారు. ఐర్లాండ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ వరకు 14,014 మందికి వర్క్‌‌‌‌ పర్మిట్లు ఇచ్చారు. వీళ్లలో 4,664 మంది ఇండియన్లే. 1,424 మందితో బ్రెజిల్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉంది. 2018లో మొత్తం 13,398 పర్మిట్లు ఇవ్వగా ఇందులో ఇండియన్లు 4,313 మంది, బ్రెజిల్‌‌‌‌ ప్రజలు 1,426 పర్మిట్లు పొందారు. నాన్‌‌‌‌ ఈఈఏ పర్మిట్లలో ఎక్కువగా హైస్కిల్డ్‌‌‌‌ లేబర్స్‌‌‌‌వేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇన్ఫర్మేషన్‌‌‌‌, కమ్యూనికేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీ రంగంలో ఇండియన్లు ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. ట్యాక్స్‌‌‌‌ సేవింగ్స్‌‌‌‌ ఎక్కువుండటంతో గూగుల్‌‌‌‌, యాపిల్‌‌‌‌ లాంటి కంపెనీలు తమ హెడ్‌‌‌‌క్వార్టర్లను ఐర్లాండ్‌‌‌‌లోనే నెలకొల్పాయి.