
రాహుల్ విజయ్ (Rahul Vijay), శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar) జంటగా కోట బొమ్మాళి పీఏస్ లో నటించి మెప్పించారు. మరోసారి ఈ జోడికలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ పెళ్లైన జంటల మధ్య అహంతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతుంది.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.భార్యాభర్తల మధ్య సత్సంబంధాలే కాకుండా, ఈ “విద్యా వాసుల అహం” వారి మధ్య వాదనలు, అహంకార సమస్యలతో ట్రైలర్ వైకుంఠంలో ప్రారంభమవుతుంది. విష్ణువు, లక్ష్మీ దేవి మధ్య జరిగే యుద్ధాన్ని ముందుగా చూపించగా., నారదుడు మధ్యలో ఉండి అసలు కథను ఆసక్తిగా చర్చిస్తాడు. పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని ఇలా గొడవలతో కలపకూడదు..యూత్‌ని ఆకట్టుకునేలా ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ అదిరిపోయింది
తెలుగు ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో మే 17న నేరుగా విడుదల కానున్న..ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల మంచి స్పందన లభించింది.ఇపుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో కొత్తగా పెళ్లయిన జంట తమ ఇగోని వదిలి కలిసి ఉంటారా..అహంతో విడిపోతారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కల్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నాడు.