Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

టాలీవుడ్ నటి ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన వేయి అబద్దాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్.. ఆ తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. అయితే.. ఈ రెండు సినిమాకు అంతగా ఆడకపోవడంతో వరుస అవకాశాలు అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత కొంతకాలానికే ప్రముఖ ర్యాప్ సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏడాది గడవక ముందే విడాకులు తీసుకుంది. 

ఇక అప్పటినుండి చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వస్తున్న  ఎస్తేర్.. ఇటీవల తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రెండో పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. పెళ్లి చేసుకొని అందమైన జీవితాన్ని గడపాలని ఉంది. ఎలాంటి వ్యక్తు భర్తగా రావాలి అనేదానిపై క్లారిటీ లేదు కానీ, నన్ను అర్థం చేసుకునేవాడైతే  చాలు.. అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో.. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.