జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. భూమి హద్దు విషయంలో ఇరు కుటుంబాల మధ్యన ఘర్షణ జరిగింది. ఒక్క కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలోని గంధం వైశాలి, కళ్లెం తిరులతి కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా హద్దు గోడ నిర్మాణ విషయం గొడవలు జరుగుతున్నాయి.
ఇవాళ మే 15 2024, బుధవారం నాడు గొడవ ఘర్షణగా మారి ఇరు కుటుంబాల మధ్య కొడవాళ్ళు, గడపరాలతో పరస్పరం దాడి చేసుకునే దాక వెళ్లింది. ఈ ఘటనలో గంధం వైశాలి కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గంధం వైశాలి పరిస్థితు విషమించడం తో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని గంధం వైశాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
