ఆరడుగుల జాగ కరువు… శ్మశానం కోసం ఉద్యమం

ఆరడుగుల జాగ కరువు… శ్మశానం కోసం ఉద్యమం

హైదరాబాద్ అంబర్ పేట్ లోని ముస్లిం శ్మశానవాటిక ఏర్పాటుపై 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు మాట తప్పుతున్నారని స్థానిక ముస్లింలు ఆగ్రహిస్తున్నారు . జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ, లోక్ భ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓట్ల కోసం హామీ ఇస్తున్నా రని, అనంతరం మర్చిపోతున్నారని మండిపడుతున్నారు. ఈసారి ఓటేసే ప్రసక్తే లేదని తీర్మానించుకున్నా రు. ప్రస్తుతం అంబర్ పేట్‌ ముస్లిం శ్మశానవాటిక ఎన్నికల క్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఎప్పటి నుంచో అడిగినా…

అంబర్ పేట్ లో ముస్లింలకు ఒక్క ఖబరస్థాన్‌ ఉంది. చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉండగా, పదేళ్ల కిందటే నిండి పోయింది.ప్రస్తుతం ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అందులో పూర్వీకుల సమాధి ఉంటేనే పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. అదికూడా వారి సమాధిని తవ్వి అందులో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంబర్ పేట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని కుటుంబాల్లో 25 శాతం ముస్లింలవే ఉంటాయి . ఓటర్లలో సుమారు 38శాతం మంది ఉంటారు. ఇంత పెద్దసంఖ్యలో ఉన్నందున ఓటు బ్యాంకు గెలుపోటములపై ప్రభావం చూపిస్తారు. ప్రతిసారి ఓట్ల కోసం వచ్చే నేతలు కొత్తగా ఖబరస్థాన్‌ ఏర్పాటు చేస్తామనే హామీ ఇవ్వడం కామనై పోయింది. ఈ అంశంపై ముస్లిం మతపెద్దలతో పాటు స్వచ్ఛంద కార్యకర్తలు ఈసారి ఉద్యమబాట పట్టారు.

లేని వారికి దిక్కుతోచని పరిస్థితి….

కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి నిర్వాహకుల వద్దకు వెళ్లి స్థలం చూపించాలంటూ వేడుకుంటున్నా రు. అంతిమ సంస్కారాలను చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కన్నీ రు పెట్టుకుంటున్నారు. పూర్వీకుల సమాధి ఉన్న వారి పరిస్థితి కాస్తనయం. పాత సమాధిని తవ్వి ఆ ప్రదేశంలోనే మళ్లీ ఖననం చేస్తున్నారు. లేని వారికి దిక్కుతోచని పరిస్థితి. దూరంగా తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. స్థానికంగా స్థలం గుర్తించి శ్మశానం ఏర్పాటు చేయాలని ఏళ్లుగా కోరుతున్నారు.

శ్మశానం కోసం ఉద్యమం…

ఎన్నికల సమయంలో ఇది చేస్తాం, అది చేస్తామంటూ హామీలు ఇచ్చే నేతలు తమ డిమాండ్ పైస్పందించాలని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో ఉద్యమం చేస్తున్నా రు. నోటాకు ఓటేస్తామని తేల్చిచెబుతున్నా రు. శ్మశానంలో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నా రు. ఏ పార్టీ కూడా తమకు న్యా యం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మతాల శ్మశానవాటికలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం సిటీలోనూ ఆలోచించాలని ముస్లిం పెద్దలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కోరుతున్నారు.