ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ బాధితులకు అండగా ఉంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన ఆయనను రాయగిరికి చెందిన ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ బాధితులు కలిశారు. ఇప్పటికే మూడుసార్లు భూ సేకరణ చేయడం వల్ల ఎంతో భూమి కోల్పోయామని, ఇప్పుడు ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వల్ల మళ్లీ తామే భూమిని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీని కలిసి సమస్యను వివరిస్తానని, అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మార్పు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పొత్నక్‌‌‌‌‌‌‌‌ ప్రమోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, పల్లె యాదగిరి, పసుపునూరి నాగభూషణం, యాదిరెడ్డి, బుచ్చిరెడ్డి, అవిశెట్టి పాండు ఉన్నారు.

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ సమీపంలో ఎడమకాల్వకు గండిపడడంతో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గండి పడిన ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించి గండి రిపేర్లు వెంటనే పూర్తి చేసి కాల్వకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సూచించారు. నిడమనూరులో బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాగర్‌‌‌‌‌‌‌‌ కాల్వల విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కాల్వకు గండి పడి వరి పంట నష్టపోయిన రైతులకు రూ.15 వేల రూ. 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కనీస వసతులు లేని బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో నిడమనూరు మినీ గురుకులం నిర్వహించడం సరికాదన్నారు. కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ కొండేటి మల్లయ్య, మాజీ ఎంపీపీ ఎడవెల్లి రంగసాయిరెడ్డి, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, ఎంపీటీసీ  విశ్వనాథుల రాణి రమేశ్‌‌‌‌‌‌‌‌, అలుగుబెల్లి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎం.లక్ష్మారెడ్డి, జి.లక్ష్మీనారాయణ, అనుముల శంకర్, చిలుముల విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధి చూడలేక అబద్ధాలు చెబుతున్రు

మఠంపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పలువురికి మంజూరైన పెన్షన్‌‌‌‌‌‌‌‌కార్డులను శనివారం హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న పార్టీ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒక్కటేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌‌‌‌‌‌‌‌ పార్వతీ కొండానాయక్‌‌‌‌‌‌‌‌, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మన్నెం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ జగన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌, సుధాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో వంటకాల తయారీపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌

గరిడేపల్లి, వెలుగు : చిరుధాన్యాలతో వివిధ రకాల పదార్థాలు తయారు చేయడంపై మహిళలు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు గడ్డిపల్లి కేవీకే సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.సుగంధి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలతో బిస్కెట్స్, కేక్, లడ్డూల తయారీ గురించి ఈ నెల 14, 15, 16 తేదీల్లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తామన్నారు. భోజన వసతి కూడా తామే కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 13లోపు తమ పేర్లను 95500 11056 నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే...

యాదగిరిగుట్ట, వెలుగు : వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే అధికారంలోకి రాబోతోందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలుపును అడ్డుకోలేవన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన పలువురు శనివారం మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సమక్షంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న అభివృద్ధిని చూసే చాలా మంది టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కొత్త, పాత అన్న తేడా లేకుండా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపీపీ భుక్యా సుశీల రవీందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచులు కల్లూరి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సత్యనారాయణ, బాలకృష్ణ, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారానికి చెందిన పలువురు శనివారం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది చేరుతున్నారన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎర్ర భుజంగం, ఎర్ర లింగస్వామి, గోపనబోయిన శివ, ఎర్ర గాలయ్య, గ్యార మారయ్య, లందగిరి నరసింహ ఉన్నారు. 

జాతీయ సమైక్యత ఉత్సవాలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

నల్గొండ అర్బన్, వెలుగు : ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా ఉత్సవాలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌, విద్యాశాఖ ఆఫీసర్లతో శనివారం నల్గొండ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 16న నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌జీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకుకోసం గ్రామాల నుంచి యువత, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, స్టూడెంట్లు జిల్లా కేంద్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 17న జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. సమావేశంలో ఆర్డీవో జగన్నాథరావు, మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, డీఈవో భిక్షపతి, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పేదల అభివృద్ధికి కృషి

తుంగతుర్తి, వెలుగు : పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌‌‌‌‌ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం, ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎర్రపహాడ్‌‌‌‌‌‌‌‌లో డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మిర్యాల గ్రామానికి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గ్రామ ప్రధాన కార్యదర్శి దిండిగాల నగేశ్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు, డీఆర్డీవో కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఎస్పీ నాగభూషణం, సీఐ నాగార్జునగౌడ్, ఎస్సై డానియేల్‌‌‌‌‌‌‌‌, ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి 3.48 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్‌‌‌‌‌‌‌‌కు 3,94,058 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 18 గేట్లను10 ఫీట్లు, 4 గేట్లను 15 ఫీట్ల మేర ఎత్త 3,48,472 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 588.10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడికాల్వకు 9,900 క్యూసెక్కులు, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీకి 2,400, మెయిన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌కు 32,886 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

సూర్యాపేట, వెలుగు : గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనం సందర్భంగా ఆత్మకూర్ (ఎస్)  మండలం కోటినాయక్‌‌‌‌‌‌‌‌ తండాలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం రాత్రి గల్లంతైన బానోతు సూర్య, నాగు మృతదేహాలు దొరికాయి. శనివారం తెల్లవారుజామున గల్లంతైన ప్రదేశానికి అర కిలోమీటర్‌‌‌‌‌‌‌‌ దూరంలో సూర్య డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ కనిపించగా, మరికొంత దూరంలోనే నాగు మృతదేహం దొరికింది. ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అభివృద్ధి చూడలేక అబద్ధాలు చెబుతున్రు

మఠంపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పలువురికి మంజూరైన పెన్షన్‌‌‌‌‌‌‌‌కార్డులను శనివారం హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న పార్టీ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒక్కటేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌‌‌‌‌‌‌‌ పార్వతీ కొండానాయక్‌‌‌‌‌‌‌‌, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మన్నెం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ జగన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌, సుధాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

మైనార్టీ గురుకులంలో హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని మైనార్టీ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌లో శనివారం హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు వివిధ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేసి, అవసరమైన వారికి ట్యాబ్లెట్లు అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు వైరల్‌‌‌‌‌‌‌‌ ఫీవర్స్‌‌‌‌‌‌‌‌ వస్తుండడంతో ముందు  జాగ్రత్తగా హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ గండ్ర శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 

హాజీపూర్‌‌‌‌‌‌‌‌ బాధితులకు ఇండ్లు ఇయ్యాలె

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌‌‌‌‌‌‌‌లో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేతిలో హత్యకు గురైన బాలికల ఫ్యామిలీలకు డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని సర్పంచ్‌‌‌‌‌‌‌‌ తిరుమల కవిత వెంకటేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత ఫ్యామిలీలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా అందేలా చూడాలని కోరారు. ఈ విషయంపై సీఎంను కలిసేందుకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇప్పించాలన్నారు. అలాగే హాజీపూర్‌‌‌‌‌‌‌‌ – మాచన్‌‌‌‌‌‌‌‌పల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, గ్రామంలో అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ నిర్మాణం, బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కవిత ఈ విషయంపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.