క్రైస్ట్ చర్చ్ మసీదు కాల్పుల్లో 49కి పెరిగిన మృతులు

క్రైస్ట్ చర్చ్ మసీదు కాల్పుల్లో 49కి పెరిగిన మృతులు

న్యూజీలాండ్ లో నరమేథం జరిగింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా దుండగులు.. గన్లు, శక్తిమంతమైన బాంబులు విసురుతూ మారణ హోమం సృష్టించారు. ఇది ఉగ్రవాదుల దాడిగా ఆ దేశప్రభుత్వం ప్రకటించింది.

ఈ టెర్రర్ ఎటాక్ లో రెండు మసీదుల్లో చనిపోయిన వారి సంఖ్య 49కి పెరిగింది.అల్ నూర్ మసీద్ లో 35 మంది చనిపోయారని… లిన్ వుడ్ మసీదులో 14 మంది ప్రాణాలు కోల్పాయారని తెలుస్తోంది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

ఈ ఉదయం ప్రమాదంపై స్పందించి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు న్యూజీలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డర్న్. 40 మంది చనిపోయినట్టు రిపోర్ట్  అందిందనీ.. 20మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఆమె చెప్పారు. ఐతే… ఈ మధ్యాహ్నం అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 49కి పెరిగింది.

ఓ మహిళ సహా నలుగురు దుండగులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిపై హత్య ఆరోపణలతో కేసు పెట్టారు. ఈ నలుగురిలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఎందుకు చేశారు.. ఎక్కడినుంచి వచ్చారు.. వీరి వెనుక ఎవరున్నారు.. ఇంకెక్కడైనా దాడులు చేస్తున్నారా.. అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం పవిత్రప్రార్థనలు ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతల కారణంగా న్యూజీలాండ్ లోని మసీదులు అన్నింటినీ మూసివేయాలని కివీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. మతాధికారులు మసీదులను మూసివేశారు. క్రైస్ట్ చర్చ్ లో కాల్పుల కారణంగా స్కూళ్లకు