
న్యూఢిల్లీ: బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఈనెల 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి ఆయన పూర్తి బాధ్యతలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. నడ్డా ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నరేంద్ర మోడీ తొలి కేబినెట్లో 59 ఏళ్ల నడ్డా మంత్రిగా పనిచేశారు. పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కిందటేడాది జులై లో నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు పార్టీ ఇన్ చార్జ్‌గా పనిచేశారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిని ఓడించి 80 ఎంపీ సీట్లకు బీజేపీ 62 స్థానాలు గెలుచుకోవడంలో నడ్డా కీలకపాత్ర పోషించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ గా కూడా ఆయన పనిచేశారు.