హవ్వ..! ఇజ్జత్ పాయే.. డిప్యూటీ సీఎంను టమాటాలు, ఉల్లిగడ్డలతో కొట్టిర్రు..

హవ్వ..!  ఇజ్జత్ పాయే.. డిప్యూటీ సీఎంను టమాటాలు, ఉల్లిగడ్డలతో కొట్టిర్రు..

గత కొద్దికాలం క్రితం టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో ఏకంగా రూ. 200 పైగా పలికింది. అయితే ఇటీవల కాలంలో టమాటా రేట్లు అమాంతం పడిపోయాయి. అటు ఉల్లి ధరలు కూడా బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..డిప్యూటీ సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎంను టమాటాలు, ఉల్లిగడ్డలతో కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకుంది. 

నాసిక్‌లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు రైతుల నుంచి నిరసన వ్యక్తం అయింది. అజిత్ పవార్ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. టమాటా ధరలు తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...అజిత్ పవార్ వాహనంపై ఉల్లిపాయలు,  టమోటాలు విసిరారు. పవార్ ఓఝర్ విమానాశ్రయం నుంచి దిండోరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

ALSO READ : ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాకొద్దు.. ఇల్లందులో బీఆర్ఎస్ అసమ్మతి నేతల డిమాండ్

ఉల్లి ఎగుమతులపై భారీగా సుంకం విధించడంతో ఉల్లిగడ్డ పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నాసిక్‌లో హోల్‌సేల్  రైతులు, హోల్ సేల్ వ్యాపారులు 13 రోజుల పాటు సమ్మె చేశారు. సుంకాన్ని తొలగిస్తామని  ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అక్టోబర్ 3న సమ్మె విరమించారు. అటు భారీగా పడిపోయిన  టమోటాలకు  మద్దతు ధర కల్పించాలని రైతులు నల్లజెండాలు చేతబూని నిరసన తెలిపారు. ఈ క్రమంలో నాసిక్ కు వచ్చిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పై  రైతులు ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు.