పార్టీ ఫండ్‌కు లెక్కలు చూపించలేక IT రైడ్స్‌లో దొరికిపోయిన పార్టీ

పార్టీ ఫండ్‌కు లెక్కలు చూపించలేక IT రైడ్స్‌లో దొరికిపోయిన పార్టీ

ముంభైలో కొత్తగా స్థాపించిని ఓ పొలిటికల్ పార్టీకి 2022లో రూ.55.5 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే ఆ డబ్బుకు ట్యాక్స్ మినహాయింపు కోసం సర్ధార్ వల్లభాయ్ పటేల్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించింది. ఇంకమ్ ట్యాక్స్ రైడ్స్ వల్ల SVPP పార్టీ అవినీతి బయటపడింది. ఎలక్షన్ అఫిడవిట్ లో ముగ్గురు అభ్యర్థులు వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేవని, సొంత ఇళ్లు, కారు లేదని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీ అభ్యర్థులు ముంభై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంభై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆ ముగ్గురు పోటీ చేశారు. 

ఆ పార్టీని స్థాపించింది దశరథ్ పారిఖ్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద పార్టీ అవసరాల కోసం ఎలక్టోలర్ బాండ్ల రూపంలో పార్టీ ఫండ్స్ సేకరించారు.  కానీ వాటికి లెక్కులు తప్పుగా చూపారు. ఆపార్టీ ఆఫీస్ బోరివలి ఈస్ట్ లోని చాల్ లోని హోల్ ఇన్ ది వాల్ ఫొటో కాపీయింగ్ సెంటర్లో ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తోంది.