కాకా గొప్ప మానవతావాది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

కాకా గొప్ప మానవతావాది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • రాజకీయం అంటే పదవులే కాదు.. ప్రజలను చైతన్య పరచడం: గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ
  •     అణగారిన వర్గాలకు చదువు, సామాజిక న్యాయం అందించారు
  •     అంబేద్కర్​ కాలేజీ మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలి
  •     కాకా గురించి వింటుంటే హార్ట్​ టచింగ్, కమిట్​మెంట్​గా అనిపించింది
  •     అంబేద్కర్​ లా కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గవర్నర్

హైదరాబాద్​సిటీ, వెలుగు:ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడం అసలైన రాజకీయ నాయకుడి లక్షణమని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. పేదల కోసం కాకా చేసిన సేవలు మరువలేనివని, ఆయన గొప్ప మానవతావాది అని అన్నారు. అణగారిన వర్గాలకు చదువు, సామాజిక న్యాయం అందించడం రాజ్యాంగ ప్రధాన సూత్రాల్లో ఒకటని, అలాంటి గొప్ప కృషి చేస్తున్న అంబేద్కర్ కాలేజీ ఎల్ల ప్పుడూ కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సోమవారం కాకా వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​బాగ్​ లింగంపల్లి అంబేద్కర్​ లా కాలేజీలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గవర్నర్​ మాట్లాడారు. కాలేజీ అచీవ్​మెంట్స్​ బుక్, కాకా స్ఫూర్తితో నిర్వహిస్తున్న క్రికెట్​సాంగ్​ను గవర్నర్​ రిలీజ్​ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగానే కాకుండా విద్యా, సామాజిక రంగాల్లో కాకా సేవలు గొప్పవి. ఐదు దశాబ్దాల్లో అంబేద్కర్​ విద్యాసంస్థలు ఎంతో మంది కలలను సాకారం చేశాయి. విద్యార్థులకు చదువుతోపాటు స్కాలర్​షిప్​లు, కౌన్సెలింగ్స్, నైపుణ్యాలను అందిస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. ఈ రకమైన కృషి రాజ్యాంగ సూత్రాన్ని సూచిస్తుంది. కాకా స్ఫూర్తిని వివేక్, వినోద్ కొనసాగించడం గొప్ప విషయం. వివిధ హోదాల్లో పనిచేసిన కాకా పేదల కోసం పరితపించారు. కాకా కృషి చూస్తే హార్ట్​టచింగ్​గా, కమిట్​మెంట్​గా ఉంది. ఈ కాలేజీ 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. మరో 50 ఏండ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్న. ఈ కాలేజీని చూస్తే.. రాజకీయాలు  కేవలం పదవులను అనుభవించడం కాదు.. ప్రజల్ని ఎంపవర్ చేయడం అని అర్థం అవుతుంది’ అని గవర్నర్​అన్నారు.  


1972 నాటికే కాకా 100 లేబర్​యూనియన్ల లీడర్​ 

1972లో ఇందిరాగాంధీ హయాంలో మినిస్టర్​గా అయ్యేనాటికే కాకా వెంకటస్వామి సుమారు 100 లేబర్ యూనియన్లలో లీడర్​గా ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘సప్లయ్​ అండ్​ రిహాబి లిటేషన్​ మినిస్ట్రీలో కాకా డిప్యూటీ మినిస్టర్​గా ఉన్నప్పుడు రేషన్ ​పథకాన్ని దేశంలో ప్రారంభించారు. కాకా టెక్స్​టైల్ మంత్రిగా ఉన్న సమయంలో ఆ రంగం ఇబ్బందుల్లో ఉండగా రూ.125 కోట్ల ప్యాకేజీని ఇచ్చి బతికించారు’ అని అన్నారు. ప్రస్తుతం టెక్స్​టైల్​ రం గంలోనే  ఎక్కువ మంది ఉన్నారని, లేబర్​ మినిస్టర్​గా కాకా ప్రైవేట్​సెక్టార్​లో పెన్షన్ ​సిస్టమ్​ను పరిచయం చేశారన్నారు. సింగరేణి క్వారీలు మూత బడే పరిస్థితికి చేరినప్పుడు ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి రూ.400 కోట్ల లోన్​తెచ్చి, లక్ష ఉద్యోగాలను కాపాడారన్నారు. ఈ రోజు సింగరేణి తెలంగాణలో అధిక లాభాలు, ఉద్యోగాలు ఉన్న సంస్థగా పని చేస్తు న్నదన్నారు. మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్​ఫ్యాక్టరీని 2004లో ఎంపీగా ఉన్నప్పుడు  ప్రధాని మన్మోహన్​ సింగ్​తో మాట్లాడి రీ ఓపెన్​కు కన్విన్స్ చేశారన్నారు. 2009లో తాను ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్​ సింగ్​ను కలవగా కాకా గురించి ఎంతో చెప్పారన్నారు. ప్రస్తుతం రామగుండం ప్లాంట్​5 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నదని, తన తండ్రి ఆశయాలను తాము కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పేదల చదువు కోసం కూడా కాకా ఎంతో ఆలోచించేవాడన్నారు. అందుకే అంబేద్కర్​ విద్యాసంస్థలను స్థాపించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంబేద్కర్​విద్యాసంస్థలు ఎంతో మంది గొప్పవాళ్లను సమాజానికి అందించిందన్నారు.   

వెనకబడిన వర్గాల వారికి చదువు కోసమే..

రాష్ట్రంలోని వెనకబడినవర్గాల వారికి విద్యను అందిం చేందుకు అంబేద్కర్​ కాలేజీలను స్థాపించామని కాలే జీ సెక్రటరీ, ఎమ్మెల్యే  వినోద్ అన్నారు. కాకా 70 ఏండ్ల పాటు ప్రజాసేవ చేశారని, ఆ సమయంలో వెనుకబడిన వర్గాలకు చెందిన 80 వేల ఫ్యామిలీలకు ఇండ్లు ఇప్పించారన్నారు. అంబేద్కర్ ​కాలేజీని అద్దె భవనంలో ప్రారం భించామని, చిన్నగా ప్రారంభమైన కాలేజీ.. వర్సిటీ, న్యాక్ అక్రిడేషన్​ సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. 
పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు తగ్గట్టుగా జీవితాంతం దళిత, గిరిజన, వెనుకబడిన వారి అభివృద్ది కోసం కాకా పాటుపడ్డారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ‘‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు కష్టపడి ఎదిగారు. ఏ హోదాలో ఉన్నా.. ఆయన పేదల కోసం పనిచేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించే తొలితరం నేతల్లో కాకా ముఖ్యులు. పేదల కష్టాలు తెలిసిన వెంకటస్వామి వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. పారిశ్రామికవేత్తలకు లొంగకుండా కార్మికుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కార్మికుల కోసం పెన్షన్​ అందించారు. 

 చదువంటే కాకాకు ఇష్టం 

కాకా చాలా రంగాల్లో పనిచేసినా ఆయనకు విద్యారంగం అంటే ఎంతో ఇష్టమని - డాక్టర్ జశ్వంత్​ రెడ్డి అన్నారు. ‘‘చదువుతో యువతను మార్చి, సమాజానికి అందించేందుకు కాకా కాలేజీని స్థాపించారు. కాకా క్రమశిక్షణతో ఉండేవారు. చక్కటి ఫిజికల్​ ఫిట్​నెస్​ఉండేది. అలాంటి మహానుభావుని ఆశయాలను నేడు వివేక్​ వెంకటస్వామి ముందుకు తీసుకెళ్తున్నారు” అని అన్నారు. 

గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు

‘కాకా గురించి ఎంత మాట్లాడినా తక్కువే.  కాకా ఆశయాలతోనే 53 ఏండ్లుగా ఈ అంబేద్కర్​కాలేజీ ప్రయాణం సాగిస్తున్నది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కాకా పెద్దగా చదువుకోలేక పోయారు. అయినా దేశనేతగా ఎదిగి.. పేదలకు చదువు అందించేందుకు కృషి చేశారు. కాకా స్కూల్​లో ఉండగా.. గాంధీని ఆదర్శంగా తీసుకు న్నారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్​లో చేరారు. అప్ప టి నుంచి ఎన్నో పదవుల్లో సేవలు అందిస్తూ.. పేద విద్యార్థుల చదువు కోసం కృషి చేశారు. ఈ కాలే జీకి వచ్చే ఏ పేద విద్యార్థులు కూడా వెనక్కి తిరిగి వెళ్లరు. దివ్యాంగ విద్యార్థులకు ప్రయారిటీ ఇస్తు న్నాం. కాలేజీలో కౌన్సిలింగ్​ ఇచ్చి, వారికి స్కిల్స్​ నేర్పించి, ప్రత్యేకంగా ప్లేస్​ మెంట్స్​కోసం కృషి చేస్తున్నాం.    - సరోజ, కరస్పాండెంట్

నాకు గైడ్, మెంటార్ 

‘కాకా వెంకటస్వామి పేదల కోసం, కార్మికుల కోసం నిరంతరం శ్రమించారు. ముఖ్యంగా నాగార్జున సాగర్​ కట్టేందుకు వచ్చిన కార్మికులకు  సొంతింటి హక్కును కల్పించి ఇండ్లు కట్టించిన మొదటి వ్యక్తి కాకా వెంకటస్వామి. నేను ఇలా ఉన్నానంటే కారణం కాకా వెంటకస్వామే. నాకు ఆయన గైడ్​, మెంటార్. ఈ దేశంలో ఏదైనా మార్పు రావాలంటే కేవలం చదువుతోనే సాధ్యం. చదువుతోనే పేదరికం, అంటరానితనాన్ని రూపుమాపొచ్చు. చదువుతోనే ప్రజల్లో గర్వం, ఆత్మవిశ్వాసం నింపొచ్చు. అలాంటి చదువును పేదలకు అందిస్తున్న కాకా వెంకటస్వామి కుటుంబీకులకు కృతజ్ఞతలు.
-  శాంత సిన్హా, రామన్​ మెగసెసే, 
పద్మశ్రీ అవార్డు గ్రహీత