- చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన మహేశ్ భగవత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించారు. దివంగత నేత వర్ధంతిని పురస్కరించుకుని కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇన్ చార్జ్ డీజీపీ మహేశ్ భగవత్.. వెంకటస్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళు లు అర్పించారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ రమణ కుమార్‌తో పాటు డీజీపీ కార్యాలయ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
