T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా

ప్రపంచ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత అసలు సిసలు సమరం ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ పొట్టి సమరానికి కనీసం నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించేశారు. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. 

అందుబాటులో ఉన్న నాణ్యమైన జట్టును ఎంపిక చేసిన తర్వాత ఇప్పుడు ప్లేయింగ్ 11 లో ఎవరుంటారనే ప్రశ్న అందరిలో నెలకొంది. మన జట్టు ప్లేయింగ్ 11 విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రానున్నట్టు తెలుస్తుంది. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అందుకు ప్రధాన కారణంగా. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో.. సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్ విషయానికి వస్తే సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్ కు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. 

అదే జరిగితే ఐదో స్థానంలో పంత్ బ్యాటింగ్ కు వస్తాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, జడేజా 6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతారు. బుమ్రా, అర్ష దీప్ సింగ్, సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా తమ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ స్క్వాడ్ లో సంజు శాంసన్, దూబే, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. 

టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా