సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్

సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్‌గా పిలుచుకునే సచ్చిన్ టెండూల్కర్‌కు  తన పక్కింటి వ్యక్తి ఎక్స్ కంప్లయింట్ చేశాడు. ముంబైలోని సచిన్ టెండూల్కర్ బాంద్రా ఇంటి లోపల పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయని, అవి రాత్రి 9 గంటలైనా ఆగడం లేదని దిలీప్ డిసౌజా ఆవేదన వ్యక్తం చేశాడు. హౌస్ కన్స్ట్రక్షన్  పనిలో భాగంగా కాంక్రీట్ మిక్సిర్ మెషిన్ వల్ల వచ్చే సౌండ్ చాలా ఇబ్బందిగా ఉందని సచిన్ టెండూల్కర్ ఇంటి పక్కన వ్యక్తి మే5న ఎక్స్ లో పోస్ట్ చేసి ఆయనకు ట్యాగ్ చేశాడు. 

కొంచెం అక్కడ వర్క్ చేసే వాళ్లకు వర్కింగ్ అవర్స్ ఫాల్లో అవ్వమని చెప్పారా అని ఆ పోస్టులో విజ్ఞప్తి చేశాడు. ఆ పోస్ట్ ఎక్స్ లో వైరల్ గా మారింది. సచ్చిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అతని పై కామెంట్లతో విరుచుకు పడుతున్నారు. ఈ ట్విట్ పై సచ్చిన్ ఇంకా స్పందించలేదు. అయితే ఎక్స్ లో మాత్రం నెటిజన్లు అనేక రకాల  కామెంట్లు పెడుతున్నారు. ఒకరు పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని సలహా ఇస్తే.. మరొకరు ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపో అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి మీ ఇంటికి ఈడీ రైడ్స్ కి రావొచ్చు అని సెటైరికల్ గా కామెంట్ చేశారు.