దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు

దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దర్భంగా బ్లాస్ట్‌‌‌‌ కేసులో మరో ఇద్దరు లష్కరే తాయిబా టెర్రరిస్టులను ఎన్‌‌‌‌ఐఏ అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లా కైరానాలో గురు, శుక్రవారాల్లో తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ.. లష్కరే తాయిబా మాడ్యూల్‌‌‌‌లోని మహ్మద్‌‌‌‌ సలీం అహ్మద్‌‌‌‌ అలియాస్‌‌‌‌ హజీ సలీం(28), కఫిల్‌‌‌‌ అలియాస్‌‌‌‌ కలీల్‌‌‌‌(30)లను అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అరెస్టు చేసిన నాసిర్, ఇమ్రాన్ తో పాటు వీరిద్దరిని శుక్రవారం బిహార్ పట్నాలోని ఎన్‌‌‌‌ఐఏ స్పెషల్‌‌‌‌ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. నలుగురు నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసింది. 

ఇక్బాల్ ఖానా డైరెక్షన్ లో..  

పాకిస్తాన్ లో షెల్టర్ పొందిన లష్కరే తాయిబా హ్యాండ్లర్‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌ఖానాకు సలీం, కలీల్ క్లోజ్‌‌‌‌ అసోసియేట్స్‌‌‌‌గా ఉన్నారు. వీరు ఐఎస్‌‌‌‌ ఆదేశాలతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేశారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఫండ్స్‌‌‌‌ కలెక్ట్ చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కైరానాలో సలీంను నాసిర్‌‌‌‌‌‌‌‌,ఇమ్రాన్‌‌‌‌ కలిశారు. రన్నింగ్‌‌‌‌ ట్రైన్‌‌‌‌లో ఐఈడీ బాంబులు పెట్టాలని ప్లాన్ చేశారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని స్కెచ్ వేశారు. దీనికోసం కలీల్​తో కోఆర్డినేట్ చేసుకున్నారు. సికింద్రాబాద్‌‌‌‌ దర్భంగా ట్రైన్‌‌‌‌లో పేలుడుకు ఏర్పాట్లు చేశారు. లిక్విడ్‌‌‌‌ కెమికల్‌‌‌‌తో ఎల్‌‌‌‌ఈడీ తయారీ దగ్గర్నుంచి క్లాత్‌‌‌‌ ప్యాక్‌‌‌‌ పార్శిల్, బ్లాస్టింగ్‌‌‌‌ వరకు సలీం మానిటరింగ్ చేశాడు. సలీం, ఇక్బాల్‌‌‌‌ ఖానా ఆదేశాలతో న్యూ మల్లేపల్లిలో నాసిర్‌‌‌‌, ఇమ్రాన్‌‌‌‌లు యాక్టివ్‌‌‌‌ సెల్స్‌‌‌‌గా పని చేసినట్లు ఎన్‌‌‌‌ఐఏ ఆధారాలు సేకరించింది.