ఈ ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్తారని ఆశిస్తున్నా

ఈ ప్రెస్ మీట్ లో అయినా నిజం చెప్తారని ఆశిస్తున్నా

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లను తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్. ఆ నిధుల‌ను ఎందుకోసం ఖ‌ర్చు పెట్టింద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. దేశంలో క‌రోనా హాస్పిటల్స్ అభివృద్ధికి మరియు ప‌రిక‌రాల కొరకు కేంద్రం రూ.15000 కోట్లు విడుదల చేసిందని, అందులో మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? ఎన్ని PPE కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు? అని అడిగారు.

ఫైనాన్స్ కమిషన్ రూ. 982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందని, రేష‌న్ కార్డు దారుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.1500 , ఈ నిధుల నుండే మళ్లించారా? అని అర్వింద్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఈ రోజు(మంగ‌ళ‌వారం) నిర్వ‌హించే ప్రెస్ మీట్ లో అయినా సీఎం గారు నిజం చెప్తాడని ఆశిస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు. జర్నలిస్ట్ లు ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, వారిని అవమానించరని ఆశిస్తున్నానని ఎంపీ అన్నారు.