రెండు ఆవులు, ఒక దూడ..బీహార్​ సీఎంకు పెరిగిన ఆస్తులు

రెండు ఆవులు, ఒక దూడ..బీహార్​ సీఎంకు పెరిగిన ఆస్తులు

న్యూఢిల్లీ: ఏడాదిగా  బీహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ స్థిరాస్తుల్లో పెరుగుదల లేదట. చరాస్తుల్లో మాత్రం కొంచెం పెరుగుదల ఉందట. పెరిగిన ఆస్తులు కూడా పశుసంపదేనట. ​పోయిన ఏడాది  ఆయన  దగ్గర 8 ఆవులు, 6 దూడలు ఉంటే…ఈ ఏడాది ఆవులు10, దూడలు 7కి ఉన్నాయట. ముఖ్యమంత్రి, కేబినెట్​ మంత్రుల ఆస్తుల స్టేట్​మెంట్​లో  ఈ విషయం వెల్లడైంది.   కొన్నేళ్లుగా  కేబినెట్​ మంత్రులతోపాటు సీఎం ఆస్తిపాస్తుల వివరాలను నితీశ్​కుమార్​  వెల్లడిస్తున్నారు.  2011 నుంచి  ఈ లిస్ట్​ గవర్నమెంట్​ వెబ్​సైట్​లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.  లేటెస్ట్​ రిపోర్ట్​ను మంగళవారం  రిలీజ్​ చేశారు. ముఖ్యమంత్రి కన్నా కేబినెట్​ మంత్రులే ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నారని ఆ రిపోర్ట్​ తెలిపింది.

  • సీఎం ఆస్తుల విషయానికి వస్తే.. ఆయన పశువులశాలలోని పశువులు మాత్రం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగాయి.  పోయిన ఏడాది  ఆయన  దగ్గర 8 ఆవులు, 6 దూడలు ఉండేవి.  ఈ ఏడాది  ఆవులు10, దూడలు 7 ఉన్నట్టు  రిపోర్ట్​ తెలిపింది.
  • నితీశ్​ మంత్రుల్లో సురేశ్​ శర్మ 9 కోట్లతో ఎక్కువ ధనవంతుడుగా ఉన్నారు.  నీరజ్​ కుమార్​కు అతి తక్కువ ఆస్తులున్నాయి.  ఆయన దగ్గర 35. 87 లక్షల  క్యాష్​ మాత్రమే ఉంది.
  • ముఖ్యమంత్రి నితీశ్​ కొడుకు  చరాస్తుల  విలువ సుమారు కోటీ 39 లక్షలు కాగా, స్థిరాస్తుల విలువ సుమారు కోటీ 48 లక్షలున్నట్టు  రిపోర్ట్​ తెలిపింది.  ఈ ఆస్తులన్నీ తల్లి ద్వారా  ఆయనకు వచ్చినవే అని రిపోర్ట్​  వెల్లడించింది.  నితీశ్​కుమార్​ భార్య గవర్నమెంట్​ స్కూల్లో టీచర్​గా పనిచేసి చనిపోయారు.  డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్​ మోడీ ఆస్తులు కోటీ 26 లక్షలు. ఆయన భార్యకు  కోటీ 65  లక్షల ఆస్తులున్నాయి.