మేం గెలిస్తే.. రామాలయాన్ని ప్రక్షాళన చేస్తం: నానా పటోలే

మేం గెలిస్తే.. రామాలయాన్ని ప్రక్షాళన చేస్తం: నానా పటోలే

నాగ్  పూర్ :  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రక్షాళన చేయిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. శంకరాచార్యులతో ప్రక్షాళన కార్యక్రమం చేయిస్తామని ఆయన చెప్పారు. మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించారు. శుక్రవారం నాగ్ పూర్ లో మీడియాతో పటోలే మాట్లాడారు. ‘‘ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నలుగురు శంకరాచార్యులు వ్యతిరేకించారు. 

మందిరంలో ప్రతిష్ఠించింది రాముడి విగ్రహం కాదు. అది రాముడి చిన్నప్పటి రూపం. మందిర నిర్మాణంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపైనా ఎంక్వయిరీ చేయిస్తం” అని పటోలే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి మొత్తం 48 సీట్లలో 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం ఏక్ నాథ్  షిండే ప్రభుత్వం పడిపోతుందని ఆయన కామెంట్ చేశారు.