అతను ఇస్రో మాజీ ఉద్యోగి.. నేను చచ్చిపోతే ఎలా బతుకుతుందన్న భయంతో.. భార్యను చంపేశాడు..!

అతను ఇస్రో మాజీ ఉద్యోగి.. నేను చచ్చిపోతే ఎలా బతుకుతుందన్న భయంతో.. భార్యను చంపేశాడు..!

అతను అల్లాటప్పా వ్యక్తి కాదు.. పెద్ద సైంటిస్ట్.. ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేస్తూ రిటైర్ అయ్యారు.. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు.. ఆర్థిక ఇబ్బందులు అంతకన్నా లేవు.. హ్యాపీ ఫ్యామిలీ.. భార్యపై బాగా ప్రేమ ఉన్న వ్యక్తినే.. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు.. ఏమైందో ఏమో.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.. నేను చచ్చిపోతే నా భార్య ఎలా బతుకుతుంది.. నేను చనిపోయిన తర్వాత నా భార్యను ఎవరు చూసుకుంటారు.. ఇలాంటి ఆలోచనలు వచ్చాయి.. అంతే.. తన భార్యను.. తానే చంపేశాడు.. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు.. అది సాధ్యం కాలేదు.. బెంగళూరు సిటీలో జరిగిన ఈ ఘోరం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అది బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పరిధిలోని బొమ్మనహళ్లి ప్రాంతం.. ఆ ప్రాంతంలోని వర్చుసో అపార్టుమెంట్  లో నివసిస్తున్నారు ఇస్రో మాజీ ఉద్యోగి నాగేశ్వరరావు, అతని భార్య సంధ్యశ్రీ. కుమార్తె అమెరికాలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందులు లేదు.. ఫ్యామిలీ సంతోషంగానే జీవిస్తోంది.. భార్య సంధ్యశ్రీని  చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నాగేశ్వరరావు..అయితే ఉన్నట్టుండి భార్య సంధ్యశ్రీని హత్యచేశాడని నాగేశ్వరరావు ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో పోలీసులు విస్తు పోయే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొంత కాలంగా  నాగేశ్వరరావు డిప్రెషన్ తో బాధపడుతున్నారు.. ఈక్రమంలో తాను చనిపోతే తన భార్య ను ఎవరూ చూసుకుంటారు..ఆమె ఎలా బతుకుతుంది.. ఇలాంటి ఆలోచన రావు మనుసును తొలిచాయి.  దీంతో ఓ కఠిన నిర్ణయానికి వచ్చారు.. భార్యను చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. అన్నంత పనిచేశారు. భార్య సంధ్యశ్రీని గొంతు కోసి చంపాడు.. తాను చనిపోవాలని ప్రయత్నించాడు కానీ.. అది కుదరక పోలీసులకు చిక్కాడు.  

నాగేశ్వర్ రావు డిప్రెషన్ తో  బాధపడుతున్నాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన రావు తాను చనిపోతే భార్య పరిస్థితి ఏంటని ఆందోళన చెంది ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడని విచారణలో తేలిందని  పోలీసులు తెలిపారు. హత్య విషయాన్ని అమెరికా లో ఉంటున్న ఆమె కుమార్తెకు తెలిపామని చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతుందన్నారు పోలీసులు.