IND vs PAK Chaos: పాక్, బంగ్లాతో వివాదం.. భారత్‌ నుంచి తరలిపోనున్న ఐసీసీ టోర్నీలు..  

IND vs PAK Chaos: పాక్, బంగ్లాతో వివాదం.. భారత్‌ నుంచి తరలిపోనున్న ఐసీసీ టోర్నీలు..  

IND vs PAK Chaos: భారత్– పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలతో భవిష్యత్‌లో భారత్ నిర్వహించాల్సిన ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ల హోస్టింగ్‌ రైట్స్ పై అనిశ్చితి నెలకొంది. 2029 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్ భారత్‌లో జరగాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితులతో ఈ  మెగా టోర్నమెంట్స్ వేరే దేశాలకు మార్చే ఛాన్స్ ని ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థ ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక’ తెలియజేసింది. ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన సైనిక పరిణామాలతో పరిస్థితి మరింత దిగజారి పోయింది. ఈ ప్రభావం క్రికెట్‌పైనా క్లియర్ గా కనిపిస్తోంది. 2025 ఆసియా కప్ సమయంలో పాక్ ప్లేయర్స్ కు టీమిండియా జట్టు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడంతో అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. అదే విధానాన్ని ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత్ కొనసాగించింది.  

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ టీం భారత్‌కు వచ్చినప్పటికీ, గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా పాక్ కి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్‌లను యూఏఈలో న్యూట్రల్ వేదికగా ఐసీసీ నిర్వహించాల్సి వస్తుంది.  ఇటీవల బీసీసీఐ, పీసీబీ కలిసి ఐసీసీతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్– పాకిస్థాన్ జట్లు ఒకరి దేశాలకు మరొకరు వెళ్లి ఆడకూడదని ఈ ఒప్పందంలో పేర్కొన్నాయి. 2008 నుంచి పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటించలేదు. పాకిస్థాన్ మాత్రం 2012–13 ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు 2016, 2023 ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వచ్చి ఆడింది. భవిష్యత్తులో ఇండియాకు రావడం కూడా కష్టమేనని పీసీబీ క్లియర్ కట్ సంకేతాలు ఇస్తోంది.

దీంతో పాటు భద్రతా కారణాలను చూపిస్తూ.. బంగ్లాదేశ్ కూడా ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ కి భారత్‌కు రావడానికి తీవ్రంగా వ్యతిరేకించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని కోరినప్పటికీ, ఐసీసీ ఆ అభ్యర్థనను పూర్తిగా తోసిపుచ్చింది. చివరకు బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్లో చేర్చింది. భారత్– బంగ్లాదేశ్ భవిష్యత్ పర్యటనలపైనా కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితులను అన్నింటిని దృష్టిలో పెట్టుకున్న.. ఐసీసీ భవిష్యత్ గ్లోబల్ టోర్నమెంట్ల నిర్వహణపై మరోసారి పునఃసమీక్ష చేస్తున్నట్లు సమాచారం. భద్రతా సమస్యలు, లాజిస్టిక్ ఇబ్బందుల కారణంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్‌లను భారత్‌కు బదులుగా ఆస్ట్రేలియాలో నిర్వహించే అవకాశం ఉందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదికలో పేర్కొనింది. ఈ రెండు మెగా ఈవెంట్ల ఆతిథ్యానికి క్రికెట్ ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉందని కూడా ఆ కథనంలో తెలియజేసింది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్థాన్‌పై 61 పరుగులతో గెలిచింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 175/7 రన్స్ చేయగా, లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్ సూపర్–8కి అర్హత సాధించింది.