కిడ్నీలు పాడైతే మెదడుపై తీవ్రప్రభావం! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

కిడ్నీలు పాడైతే మెదడుపై తీవ్రప్రభావం! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

మూత్రపిండాలు ( Kidneys).. రక్తాన్ని శుద్ది చేయడం, శరీరంలో అదనపు నీటిని ఫిల్టర్ చేసి బయటికి పంపడం, శరీరంలో రసాయనాల సమతులత్య,  బీపీ నియంత్రించడం వంటి పనులు చేస్తుంది. అంతేకాదు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన హార్మోన్లను కిడ్నీలు విడుదల చేస్తాయి. అలాంటి  కీలకమైన ఆర్గాన్స్ చెడిపోతే.. పరిస్థితి ఏంటో ఆలోచించండి.. ఇతర అవయవాలపైన కూడా ప్రభావం పడుతుంది.. అవయవాల ఫంక్షనింగ్ దెబ్బతింటుంది.. అయితే ఇటీవల జరిపిన పరిశోధనల్లో మరో భయపెట్టి విషయం వెలుగులోకి వచ్చింది.  కిడ్నీలు పాడైతే అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. 

కిడ్నీలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బారిన పడితే మెదడు పనితీరు క్షీణిస్తుందని, శ్రధ్ద, జ్ణాపక శక్తి తగ్గుతుందని ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) కొత్త అధ్యతయనం వెల్లడించింది. ఈ పరిశోధనల్లో కిడ్నీ వ్యాధుల తీవ్రత మెదడు క్షీణతకు దారితీస్తుందని  స్పష్టం చేస్తున్నాయి. 

యూఎస్ లోని టులేన్ యూనివర్సిటీ పరిశోధకులతో సహా 21 నుంచి 79 వయసున్న  5వేల 600 మందిపై పరిశోధనలు చేశారు. మూత్రపిండాల పనితీరు కోసం రక్తం, మూత్రం శాంపిల్స్ ను విశ్లేషించారు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ పరిశోధనల్లో మెదడు పనితీరును అంచనా వేశారు. 

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న 5వేల607 మందిని పరిశీలించిన అధ్యయనంలో ..క్రియాటిన్ పరీక్షలో అధిక ప్రోటీన్  ఉంటటంతో మెదడు ప్రాసెసింగ్ వేగం, శ్రద్ధ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. దీంతో శరీర ప్రక్రియలు ఎలా ప్రభావితం అవుతున్నాయో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలకంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులున్న రోగులలో మానసిక వైకల్యం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైనదే.. శరీర అంతర్గత నిర్మాణంలో ఉన్న గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, గట్స్,  మూత్రపిండాల వంటి కీలక అవయాల  పనితీరులో ఏదైనా  తేడా వచ్చిందని అనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకొని తగు చికిత్స తీసుకోవడం వాటిని కాపాడుకోవచ్చంటున్నారు. మరీ ముఖ్యంగా  మూత్రపిండ వ్యాధుల బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.