హత్యలు చేయటానికి.. ఆన్ లైన్ లో కత్తులు ఆర్డర్ చేస్తున్న క్రిమినల్స్.. !

హత్యలు చేయటానికి.. ఆన్ లైన్ లో కత్తులు ఆర్డర్ చేస్తున్న క్రిమినల్స్.. !

బ్లింకిట్ మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల క్విక్ డెలివరీపై విమర్శల పాలైన బ్లింకిట్.. తాజాగా చట్ట విరుద్ధంగా కత్తులను ఆన్ లైన్  లో విక్రయిస్తూ అడ్డంగా దొరికింది. ఓ కస్టమర్ గా  రంగంలోకి దిగిన పోలీసులు.. బ్లింకిట్ క్రిమినల్ ఆర్డర్లను నిర్ధారించుకొని ఇది హత్యలు చేసేందుకు ప్రోత్సహించడమే అంటూ కేసు బుక్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

హత్యలకు తరచుగా ఉపయోగించే బటన్ కత్తులు లేదా బటన్ లాక్ కత్తిని అమ్మినందుకు ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్ బ్లింక్‌ఇట్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితులు యాప్ ద్వారా కత్తులను కొనుగోలు చేసినట్లు అంగీకరించడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

పశ్చిమ ఢిల్లీలో రెండు వేర్వేరు హత్యలపై దర్యాప్తు క్రమంలో  రెండు నేరాలకు ఉపయోగించిన కత్తులను బ్లింక్ఇట్ ద్వారా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు కస్టమర్లుగా నటిస్తూ ప్లాట్‌ఫాం నుంచి అలాంలటి కత్తులను కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..7.62 సెం.మీ పొడవు ,1.72 సెం.మీ వెడల్పు ఉన్న బ్లేడ్లు కలిగిన కత్తులను మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. అంతకంటే పెద్దది ఏదైనా ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. చట్టరీత్యా నేరం కూడా. దర్యాప్తులో భాగంగా కత్తి 8 సెం.మీ పొడవు , 2.5 సెం.మీ వెడల్పు కలిగిన కత్తులను పోలీసులు ఆర్డర్ చేయగా బ్లింకిట్  డెలివరీ చేసింది. ఈ కత్తుల పరిమాణం లీగల్ లిమిట్స్ దాటి పోయింది. 

ALSO READ : శంషాబాద్ ఏరియాలో పెద్ద హాస్పిటల్ కట్టారు..

ఆ తర్వాత పోలీసులు ఢిల్లీ అంతటా అనేక బ్లింకిట్ డార్క్ స్టోర్లపై దాడి చేసి 55 కి పైగా కత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అటువంటి కత్తులను విక్రయించినందుకు కేసు నమోదు చేశారు. ఆన్ లైన్ వీటి ధరలు  రూ. 699  వరకు అమ్ముతున్నట్లు తేలింది. 

బ్లింక్ఇట్ గత నెలలో 10 నిమిషాల డెలివరీపై విమర్శల పాలైంది.ఇది ప్రజా చర్చనీయాంశంగా మారింది. ఇది డెలివరీ భాగస్వాముల భద్రతకు ముప్పు కలిగిస్తుందని చాలామంది ఆరోపించారు. వేతనం పెంపు , సామాజిక భద్రత ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో క్విక్ డెలివరీ విధానాన్ని కేంద్రం ఎత్తివేసింది.