T20 World Cup: నమీబియా బౌలర్లపై విరుచుకుపడిన సాహిబ్జాదా ఫర్హాన్.. పాక్ స్కార్ ఎంతంటే..? 

T20 World Cup: నమీబియా బౌలర్లపై విరుచుకుపడిన సాహిబ్జాదా ఫర్హాన్.. పాక్ స్కార్ ఎంతంటే..? 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్–ఏలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్– నమీబియా జట్లు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో తల పడుతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు  3 వికెట్ల నష్టానికి   199 పరుగులు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నమీబియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కి ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. జాక్ బ్రాసెల్ బౌలింగ్ లో సైమ్ అయూబ్‌(14)ని అవుట్ చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కోలుకుని బ్యాటింగ్ లో దూకుడు పెంచింది. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఒకవైపు, వికెట్లు పడుతున్నప్పటకీసెంచరీతో టీం స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 

పాకిస్థాన్ 107 పరుగులు వద్ద రెండో వికెట్ ని కోల్పోయింది. జాక్ బ్రాసెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (38)  మిడ్-ఆఫ్‌లో ఉన్న గెర్హార్డ్ ఎరాస్మస్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఖవాజా నఫే (5) కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో 118 పరుగులకే కీలకమైన 3 వికెట్లను పాకిస్థాన్ టీం కోల్పోయింది. ఆ తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన షాదాబ్ ఖాన్.. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తో కలిసి ఇన్సింగ్ ని ముందుకు నడిపించారు.  
 
సాహిబ్జాదా ఫర్హాన్ కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేయగా.. చివర్లో ఓవర్లో షాదాబ్ ఖాన్  వరుసగా రెండు సిక్సులు కొట్టడంతో పాకిస్థాన్ జట్టు భారీ స్కార్ సాధించింది. దీంతో 20 ఓవర్లలోనే పాక్ టీం 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో జాక్ బ్రాసెల్ 2 వికెట్లు తీసుకోగా, గెర్హార్డ్ ఎరాస్మస్ ఒక వికెట్ పడగొట్టాడు.