
గౌహతి: అస్సాంలోని కాచర్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో.. 7 కోట్ల రూపాయల విలువైన 1.2 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. మే 10వ తేదీ శుక్రవారం రాత్రి డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
కాచార్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నుమల్ మహట్ట మాట్లాడుతూ.. "ధోలై, సిల్చార్ ప్రాంతంలో నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. కాచర్ జిల్లా పోలీసుల బృందం ధోలాయ్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించి 55 హెరాయిన్ సబ్బు కేసులను స్వాధీనం చేసుకుంది. రెండో ఆపరేషన్‌లో సిల్చార్ ప్రాంతంలో 45 హెరాయిన్ సబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు" అని వెల్లడించారు.
గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్టయిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.