కనుజు మాంసం పట్టివేత

 కనుజు మాంసం పట్టివేత
  • ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్  జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి(కనుజు) మాంసాన్ని ఫారెస్ట్​ ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్​ చేశారు. ఎఫ్ఆర్వో వజహత్​ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి దుర్గారంలో కనుజును వేటాడి మాంసం పోగులు వేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపారు.

 వెంటనే ఎఫ్ఎస్ వో రాజేశ్, ఎఫ్ బీవో​రాకేశ్, సిబ్బందిని పంపి గ్రామంలో సోదాలు నిర్వహించగా, సుధాకర్, నర్సింహ, ఉపేందర్​ ఇండ్లల్లో వండిన మాంసం లభించిందని చెప్పారు. ఉచ్చులు వేసి కనుజును వేటాడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ముగ్గురిపై వన్యప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. ఉచ్చులు, వండిన మాంసం సీజ్  చేసినట్లు చెప్పారు.