జనగామ అర్బన్, వెలుగు: జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, కౌంటింగ్ నిర్వహించనున్న ఏకశిల బీఈడీ కాలేజీని ఆదివారం జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికల నిబంధనల అమలు తదితర అంశాలపై ఆరా తీశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో మున్సినల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
