పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో స్వామి వివేకానంద, సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్లీ 5 కే రన్ పరుగు పందెం పోటీ నిర్వహిస్తున్నట్లు ఆర్డీఎఫ్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఆదివారం తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 15న ఈ పోటీలు ప్రారంభమవుతాయని, కల్లెడ ఎల్లమ్మ గుడి వద్ద నుంచి పర్వతగిరి పర్వతాల శివాలయం వరకు కొనసాగుతాయన్నారు.
పురుషులు, మహిళలకు విడివిడిగా పోటీలు ఉంటాయని, ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి రూ. వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కటకం మురళీధర్ హాజరుకానున్నారని, పూర్తి వివరాలకు 90520 09150, 85019 51055, 63023 01693 ను సంప్రదించాలని కోరారు.
