- మంత్రి జూపల్లి
కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మేకల కిషోర్ యాదవ్, 13వ వార్డు అభ్యర్థి వంగ అనూషను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడే ఏలాంటి అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు అధికారం లేకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
