మున్సిపల్ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలి

నర్సంపేట/ వర్ధన్నపేట, వెలుగు : ఈ నెల 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని వరంగల్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించి, పలు సూచనలు చేశారు. అనంతరం వర్ధన్నపేట రైతు వేదికలో కౌంటింగ్​ సూపర్​వైజర్స్, అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.