రామంతాపూర్ బాధిత కుటుంబాలకు..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

రామంతాపూర్ బాధిత కుటుంబాలకు..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

హైదరాబాద్ : రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు హామీ ఇచ్చింది. 

సోమవారం ఘటన జరిగిన కొద్ది గంటల్లో మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రకటన చేశారు. మృతులకు కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడ్డ వారికి వైద్యం ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 

►ALSO READ | కేబుల్ వైర్ల వల్లే ప్రమాదం..రామంతాపూర్ ఘటనపై విద్యుత్ శాఖ సీఎండీ

రామంతా ఘటన చాలా బాధాకరం.. చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మరో 100 మీటర్లలో శోభాయాత్ర ముగుస్తుందనగా ఈ విషాద ఘటన జరగడం దురదదృష్టకరం అన్నారు. కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి విచారణకు ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు.. కేబుల్ వైర్లు, కరెంట్ వైర్లు కలిసి ఉండటం వల్ల ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉన్నందున స్పెషల్ డ్రైవ్ లో పరిష్కారానికి మార్గం వెతకాలని ఆదేశించారు.