కేబుల్ వైర్ల వల్లే ప్రమాదం..రామంతాపూర్ ఘటనపై విద్యుత్ శాఖ సీఎండీ

కేబుల్ వైర్ల వల్లే ప్రమాదం..రామంతాపూర్ ఘటనపై విద్యుత్ శాఖ సీఎండీ

రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనపై విద్యుత్ శాఖ సీఎండీ స్పందించారు. రామంతాపూర్ ఘటన బాధాకరం..కేబుల్ వైర్ల వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాధమిక అంచనాకు వచ్చాం. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం..డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించి మృతులకు, గాయాలైన వారికి నష్టపరిహారం విషయంపై చర్చిస్తాం అన్నారు. రామంతాపూర్ విద్యుత్ షాక్ తర్వాత..ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది..తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సోమవారం  తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమిసందర్భంగా గోఖలేనగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. రథానికి కట్టినజీపు పాడవడంతో స్థానికులు, భక్తులు రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో యాత్ర సాగుతుండగా చాలా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ఒక్కసారిగా శోభాయాత్ర రథానికి తాగడంతో విద్యుత్ షాక్ తగిలింది.   

►ALSO READ | మాకు న్యాయం జరిగే వరకు వెళ్లొద్దు..రామంతాపూర్‌లో ఉద్రిక్తత..విద్యుత్ శాఖ సీఎండీని నిలదీసిన స్థానికులు

ఈ ప్రమాదం సమయంలో రథంపై ఉన్న దాదాపు డజన్ మందికి విద్యుత్ షాక్ తగిలింది. స్పాట్ లో ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.