మాకు న్యాయం జరిగే వరకు వెళ్లొద్దు..రామంతాపూర్‌లో ఉద్రిక్తత..విద్యుత్ శాఖ సీఎండీని నిలదీసిన స్థానికులు

మాకు న్యాయం జరిగే వరకు వెళ్లొద్దు..రామంతాపూర్‌లో ఉద్రిక్తత..విద్యుత్ శాఖ సీఎండీని నిలదీసిన స్థానికులు

రామంతాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది.. రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారు జామున రామంతాపూర్ లోని గోఖలే నగర్ లోశ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో శ్రీకృష్ణుని రథానికి విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు ఇక్కటినుంచి కదిలేది  లేదని స్పష్టం చేశారు. గోఖలే నగర్ లో గత కొంతకాలంగా విద్యుత్ సమస్యలు ఉన్నాయని, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

సోమవారం  తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమిసందర్భంగా గోఖలేనగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. రథానికి కట్టినజీపు పాడవడంతో స్థానికులు, భక్తులు రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో యాత్ర సాగుతుండగా చాలా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ఒక్కసారిగా శోభాయాత్ర రథానికి తాగడంతో రథంపై ఉన్న దాదాపు డజన్ మందికి విద్యుత్ షాక్ తగిలింది. స్పాట్ లో ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. 

►ALSO READ | బ్రేకింగ్: రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మరొకరు మృతి

కృష్ణాష్టమి శోభాయాత్ర సందర్భంగా ఊహించని విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలో మిన్నంటాయి. మృతుల్లో కృష్ణాయాదవ్ 24ఏళ్ల చిన్న వయస్సులో చనిపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది.  ఒక్కగానొక్క కొడుకు, వంశానికి ఒకే ఒక్కడు చనిపోవడంలో కృష్ణాయాదవ్ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు అందరిని కలచివేశాయి. ఊహించని ఈ ఘటనకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.