మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పొత్తులపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియలో వేగం పెంచిన కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, తెలంగాణ జనసమితి,ఎంఐఎంతో చర్చలు జరుపుతోంది. సీపీఎం పార్టీతోను కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది.
ఎంఐఎంతో ఫ్రెండ్లీ అవగాహనతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుంది. మున్సిపాలిటీల్లో ఎన్నికల తర్వాత ఎంఐఎం మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇవ్వనుంది కాంగ్రెస్.
మున్సిపల్ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం (జనవరి 27) ప్రకటించారు. 414 డివిజన్లు, 2,582 వార్డులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు.
Also Raed : ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయం.. విచారణ జరగాలె.. నిజాలు తేలాలె
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు రేపే(జనవరి 30) చివరి తేదీ. ఫిబ్రవరి 3 బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 11న బ్యాలెట్ పేపర్‌తో ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 13న ఫలితాలు ప్రకటించి, 16న పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించడంతో మున్సిపోల్స్ ప్రక్రియ ముగియనుంది.
