ఈ రోజుల్లో మోకాలి నొప్పి సాధారణ సమస్య అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు అర్థరైటిస్ వల్ల మోకాలి నొప్పి అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చుని పనిచే యటం. కొన్ని ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. కీళ్ళ ద్రవాలు ఎండిపోతే కీళ్ల సమస్యలు వస్తాయం టున్నారు ఆర్థోపెడిస్టులు.
ఒక్క కేరట్..పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్ కేరట్ లో పుష్కలంగా లభిస్తుంది. కొద్దిగా కేరట్ తురుము, కొద్ది నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మోకాలి నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కేరట్ జ్యూస్ ని తాగినా చక్కటి ఫలితం లభిస్తుంది.
►ALSO READ | Health News : గురక ఎందుకు వస్తుంది.. డాక్టర్ దగ్గరకు వెళ్లాలా లేదా..?
నీళ్లు సమృద్ధిగా..గ్లాసుడు నీళ్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా పనిచేస్తా యి. మోకాలి చుట్టూ ఉన్న కార్టిలేజ్ ను లూబ్రికేట్ చేసి మృదువుగా చేయ డానికి నీళ్లు సమృద్ధిగా తీసుకోవాలి.
ఉల్లిపాయలు:యాంటీ ఇంఫ్లేమేటరీ, పదార్థాలు ఉల్లిపాయలతో సమృద్ధిగా ఉండటం వల్ల మోకాలి నొప్పులను తగ్గించేందుకు తోడ్పడతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుప రుస్తాయి. ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ కంటెంట్ మోకాలి కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహకరిస్తుంది.
