గురక ఎదుటివాళ్లకు మాత్రమేకాదు..గురకపెట్టేవాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. అసలు గురక ఎందుకొస్తుందంటే.. కొందరిలో గొంతుకు సంబంధించిన కణజాలం బిగువుగా ఉండటం, మరికొందరిలో నాలుక మడతపడి శ్వాసకు అడ్డుపడటం వల్ల గురక వస్తుంది. సమస్య ఏదైనా నిద్రకు మాత్రం ఇబ్బందికలిగిస్తుంది.
కొన్ని మందులను ఎక్కువరోజు వాడాల్సి ఉండటం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడానికి కారణమయ్యే వాతావరణ పరిస్థితులు కూడా గురకను తెస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు. రాత్రి మద్యం సేవించడం, ఇంటి పరిసరాలు కూడా నిద్రకు దూరం చేస్తుంటాయి.
కారణాల్ని గుర్తించి వాటికి దూరమైతే గురక సమస్యను తగ్గించవచ్చు. ఒకవేళ అప్పటికీ సమస్య అలాగే ఉండిపోతే అప్పుడిక ఇతర మార్గాల్ని అన్వేషించక తప్పదు. డాక్టర్లను సంప్రదించి, అందుకు ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
