బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 27.
ఖాళీలు: 21.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ – ఈ కార్డియాలజీ 02, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ 01, న్యూక్లియర్ మెడిసన్ 01, సైంటిఫిక్ ఆఫీసర్ – డీ ఈఎన్టీ 01, రేడియాలజీ 03, ఆప్తమాలజీ 01, పాథాలజీ 01, అనస్థీషియాలజీ 01, న్యూక్లియర్ మెడిసన్ 03, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 01, సైంటిఫిక్ ఆఫీసర్ – సీ జనరల్ డ్యూటీ/ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ 05, టెక్నికల్ ఆఫీసర్ – డీ న్యూక్లియర్ మెడిసన్ 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, బీడీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా, ఎంఎస్సీతోపాటు కనీసం నాలుగేండ్ల పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 30.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 27,
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.barc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
►ALSO READ | Walk-in-Interview: ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్
