ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) 01/2027 & 02/2027 బ్యాచుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 6.
పోస్టు పేరు: అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి + ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో గణితం, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.
ఎస్ఎస్ఆర్ (మెడికల్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి+ ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో కెమిస్ట్రీ, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
వయోపరిమితి: 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
బ్యాచ్ 01/ 2027: 2004, డిసెంబర్ 1 నుంచి 2009, మే 31 మధ్య జన్మించి ఉండాలి.
బ్యాచ్ 02/ 2027: 2005, మే 1 నుంచి 2009, అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.
వైవాహిక స్థితి: కేవలం అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 14.
అప్లికేషన్ ఫీజు: అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ. 550 + 18% జీఎస్టీ.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 6.
పరీక్ష తేదీ: 2026, మే (అంచనా).
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
స్టేజ్–1 (ఐఎన్ఈటీ ఆన్‌లైన్ ఎగ్జామ్): ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 60 నిమిషాలు. ప్రశ్నలు ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ఉంటాయి.
స్టేజ్–2 (పీఎఫ్‌టీ & రాత పరీక్ష): ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష ఉంటుంది.
స్టేజ్– 3 (మెడికల్): చివరగా వైద్య పరీక్షలు నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తారు.
శిక్షణ, విధులు
ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ప్రాథమిక శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం విమాన వాహక నౌకలు, యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లపై విధుల్లోకి తీసుకుంటారు. వీరు అధునాతన ఆయుధ వ్యవస్థలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలను నిర్వహించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు: అగ్నివీర్ పథకం కింద నాలుగేండ్ల కాలానికి నియమిస్తారు.
మొదటి సంవత్సరం: నెలకు రూ. 30,000 (చేతికి రూ. 21,000 వస్తుంది, మిగిలిన రూ. 9,000 కార్పస్ ఫండ్‌కు వెళ్తుంది).
వార్షిక పెరుగుదల: ప్రతి సంవత్సరం జీతం పెరుగుతూ 4వ సంవత్సరంలో రూ. 40,000 కి చేరుతుంది.
సేవా నిధి: 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేటప్పుడు వడ్డీతో కలిపి రూ. 10.04 లక్షలు అందుతాయి.
రిజర్వేషన్: 4 ఏళ్ల తర్వాత 25% మందిని శాశ్వత ప్రాతిపదికన నేవీలోకి తీసుకుంటారు.
అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్
ఇండియన్ నేవీ అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్) 01/2027 & 02/2027 బ్యాచుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస మార్కుల శాతం అవసరం లేదు. కేవలం పాస్ అయితే సరిపోతుంది.
వయోపరిమితి: 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
బ్యాచ్ 01/ 2027: 2004, డిసెంబర్ 1 నుంచి 2009, మే 31 మధ్య జన్మించి ఉండాలి.
బ్యాచ్ 02/ 2027: 2005, మే 1 నుంచి 2009, అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.
వైవాహిక స్థితి: కేవలం అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 14.
అప్లికేషన్ ఫీజు: అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ. 550 + 18% జీఎస్ టీ.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది.
స్టేజ్ -1 (ఐఎన్ఈటీ): ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. ప్రశ్నలు సైన్స్ & మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
స్టేజ్-2: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), రాత పరీక్ష, ఫైనల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది.
