కూకట్పల్లిలో పది మీటర్ల నాలా మూడు మీటర్లు అయ్యింది.. ఆక్రమణలు తొలగించిన హైడ్రా

కూకట్పల్లిలో పది మీటర్ల నాలా మూడు మీటర్లు అయ్యింది.. ఆక్రమణలు తొలగించిన హైడ్రా

హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కొరడా  ఝుళిపించింది. సోమవారం (ఆగస్టు 18) కూక‌ట్‌ప‌ల్లి, ఏవీబీపురంలో నాలా ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్ర్మ నిర్మాణాలను తొలగించింది. ప‌రికి చెరువు నుంచి కూక‌ట్‌ప‌ల్లి వెళ్లే నాలా కబ్జాలను తొలగించారు హైడ్రా అధికారులు. 

పరికి చెరువు నుంచి కూకట్ పల్లి వెళ్లే నాలా వెడల్పు 10 మీటర్లు ఉండగా, కబ్జాలతో 3 మీటర్లు అయింది. నాలాపైన వెలిసిన రెండు ష‌ట్టర్లను తొలగించారు. మ్యాన్‌హోల్‌ పైన ఏర్పాటు చేసిన సెల్ ఫోన్, ల్యాప్ టాప్ రిపేర్ షాప్ లను తొలగించారు హైడ్రా అధికారులు.

Also read:-హైదరాబాద్లో.. అమీర్ పేట్, మైత్రి వనం ఏరియాలు.. మళ్లీ ఇలా అవకుండా రంగంలోకి హైడ్రా !

 నాలా ఆక్రమ‌ణ‌తో సాయిబాబాకాల‌నీ, హెచ్ ఏ ఎల్ కాల‌నీ, మైత్రిన‌గ‌ర్‌లో  వ‌ర‌ద ముంచెత్తుతోంది. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆక్రమణల తొలగించింది హైడ్రా.