
హే కృష్ణా ఏంటీ ఘోరం..తండ్రి చూస్తుండగానే కుప్పకూలిన కొడుకు..తండ్రి కండ్లముందే కొడుకు మరణం..అప్పటివరకు తనతో కలిసి బాధ్యత నెత్తినేసుకొని కార్యక్రమం నడిపించిన కొడుకు ఒక్కసారిగా మృత్యువొడికి చేరడంతో ఆ తండ్రి వేదన అంతా ఇంతా కాదు.. ఒకే ఒక్క కొడుకు.. వంశానికి కొక్కడు..ఆ కుటుంబ పరిస్థితిని తలుచుకుంటే కంటనీళ్లు రాకుండా ఉండవు.
24యేళ్ల కృష్ణయాదవ్ వాళ్ల ఫ్యామిలీ ఒకేఒక్క మగపిల్లాడు.24 యేళ్లు నిండకముందే నిండు నూరేళ్లు నిండాయా కొడుకా అంటూ..కన్నవాళ్లు, బంధుువుల రోదనలు అందరిని కలచివేశాయి. రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన కృష్ణయాదవ్.. బాబాయి, పెద్దనాన్నలకు కూడా అమ్మాయిలే..వంశానికి ఒకేఒక్కడు కృష్ణయాదవ్.. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఘటనలో కృష్ణ యాదవ్ మృతి వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కృష్ణాయాదవ్ తండ్రి రఘు యాదవ్ గోఖలే నగర్ యాదవ సంఘం ప్రెసిడెంట్. తండ్రీకొడుకులిద్దరూ దగ్గరుండి శ్రీకృష్ణుని శోభాయాత్రను ముందుకు నడిపించారు. ప్రమాదం జరిగిన కృష్ణాయాదవ్ తండ్రి స్పాట్ లో ఉన్నారు. తండ్రి కళ్ల ముందే కృష్ణా యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఫొటోలు పట్టుకొని రోదిస్తున్న కృష్ణ యాదవ్ తల్లీ బాధ వర్ణనాతీతం.. కొడుకా..కొడుకా అని రోదిస్తు్న్న దృశ్యాలు కంట తడి పెట్టించాయి.