భారతీయుల సగటు ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ, రిటైర్మెంట్ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోందనే వాదన పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు ఆధునిక ఏఐ యుగంలో ప్రజలకు ఖర్చులు భారీగానే పెరుగుతున్నాయి. అందువల్ల కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే ఆధారపడితే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సీనియర్ సిటిజన్లు తమ ఆర్థిక అవసరాలను బట్టి పెట్టుబడులను త్రీ-బకెట్స్‌గా డివైడ్ చేసుకోవాలని వ్యాల్యూ రీసెర్చ్ సీఈఓ ధీరేంద్ర కుమార్ సూచిస్తున్నారు.
మొదటి బకెట్:
రోజువారీ ఖర్చుల కోసం కేవలం తమ పొదుపు మొత్తంపైనే ఆధారపడతారో.. వారు అసలు రిస్క్ తీసుకోకూడదు. అటువంటి వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటి ప్రభుత్వ గ్యారెంటీ కలిగిన స్కీమ్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ స్కీమ్ ద్వారా దాదాపు 8.2% వరకు వడ్డీ లభిస్తోంది. ఇది సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని లేటు వయస్సులో అందిస్తుంది.
రెండవ బకెట్:
పెన్షన్ లేదా అద్దెల ద్వారా కొంత ఆదాయం వస్తూ.. అదనపు ఆదాయం కోసం ఎదురుచూసేవారు కొంత మేర రిస్క్ తీసుకోవచ్చు. వీరు తమ పెట్టుబడిలో 5% నుండి 20% వరకు మ్యూచువల్ ఫండ్లకు కేటాయించవచ్చు. ముఖ్యంగా బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్స్ వీరికి మంచి ఆప్షన్. ఇవి ఈక్విటీ అలాగే డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి కాబట్టి.. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కూడా ఉంటుంది.
ALSO READ : ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయటంలో అమెరికాను దాటేసిన సౌదీ..
మూడవ బకెట్:
ఖర్చుల కోసం పెట్టుబడిపై ఆధారపడని వారు తమ సంపదను పెంచుకోవడానికి ఎక్కువ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కేటాయించవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు వచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. అందుకే 50:50 నిష్పత్తిలో ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కేటగిరీల్లో పెట్టుబడి పెట్టడం 'స్వీట్ స్పాట్' అని ధీరేంద్ర కుమార్ సూచిస్తున్నారు.
నెలవారీ ఆదాయం కోసం డివిడెండ్ల కంటే సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ అత్యంత ప్రభావవంతమైనది. ఇది డివిడెండ్ల కంటే ఎక్కువ పన్ను ఆదా చేస్తుంది. స్థిరమైన క్యాష్ ఫ్లో అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఎంపికలో HDFC సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఫండ్ లేదా ICICI ప్రుడెన్షియల్ బాండ్ ఫండ్ వంటి బెస్ట్ చాయిస్ కింద పరిగణించవచ్చు. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం ఒత్తిడి లేకుండా గడుస్తుంది. అయితే దీనికి సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ముఖ్యం.
