రియాక్టర్ బ్లాస్ట్ అయి 54 మంది కార్మికులు చనిపోయిన కేసులో సిగాచీ పరిశ్రమ సీఈవో అరెస్ట్

రియాక్టర్ బ్లాస్ట్ అయి 54 మంది కార్మికులు చనిపోయిన కేసులో సిగాచీ పరిశ్రమ సీఈవో అరెస్ట్

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 30వ తేదీన సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్టింగ్లో 54 మంది కార్మికుల మృతితో సిగాచీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసిన పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ రిమాండ్కు తరలించారు. సిగాచి పరిశ్రమ పేలుడు కేసులో అమిత్ రాజ్ సిన్హా ఏ2గా ఉన్నారు.

పాశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో 2025, జూన్ 30న రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 54 మంది దుర్మరణం పాలయ్యారు. కొందరు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. జూన్ 30న ఉదయం 9.00– 9.30 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుళ్ల ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్ప కూలింది.