కొత్త సంవత్సరం రాబోతుంది. కొద్ది రోజుల్లో 2025 వ సంవత్సరానికి గుడ్ బై చెప్పనున్నారు. 2026 వ సవంత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జనాలు రడీ అవుతున్నారు. కొత్త ఏడాది..కొత్త రుచులు.. నాన్ వెజ్ వంటకాలతో వెల్కమ్ చెప్పేందుకే పసందైన ఫిష్ రెసీపీ ల గురించి తెలుసుకుందాం. . .
ఫిష్ కట్లెట్స్ తయారీకి కావాల్సినవి
- సాల్మన్ ఫిష్- అరకిలో
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
- అల్లం ముక్క -కొద్దిగా
- పచ్చిమిర్చి- రెండు
- వెల్లుల్లి రెబ్బలు- మూడు
- బ్రెడ్ ముక్కలు-100 గ్రాములు
- కోడిగుడ్డు -ఒకటి
- పుదీనా -ఒకకట్ట
- పసుపు-చిటికెడు
- ఉప్పు- తగినంత
- కారం-ఒకటి స్పూన్
- మిరియాలు - నాలుగు లేదా ఐదు
- నూనె - సరిపడా
- నిమ్మరసం- అరటీస్పూన్
- అలుగడ్డ- ఒకటి
- సోంపు - ఒకటీ స్పూన్
- బియ్యప్పిండి-పావు కప్పు
తయారీవిధానం: ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి అఆవిరిపై చేప ముక్కలు ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్న టైంలో మూతపెట్టడం మరిచిపోవద్దు. మరోపక్క బ్రెడ్ ముక్కలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పు, పసుపు, కారం చేసి మిక్స్ పట్టాలి. మిరియాలు, సోంపు మెత్తగా దంచి ఈ మిశ్రమంలో కలపాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. తర్వాత ఉడికించిన అలుగడ్డను మెత్తగా చేసి దాన్ని కూడా ఈ మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకుని కట్ లెట్ చేసుకుంటూ మధ్య మధ్యలో బియ్యప్పిండిని అద్దుతూ ఉండాలి ఇలా తయారుచేసుకున్న కట్ లెట్స్‌ను పదినిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి కాస్త కాగాక కట్లెట్స్ వేసి వేగించాలి. వీటిని పుదీనాతో గార్నిష్ చేస్తే మును ఘుమలాడే ఫిష్ కట్ లెట్స్ రెడీ.
చికెన్– టొమాటో మంచూరియా తయారీకి కావాల్సినవి
చికెన్ (బోన్)- అర కేజీ
ఉల్లిగడ్డలు-రెండు
క్యాప్సికమ్ -ఒకటి టొమాటో -ఒకటి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి -ఆరు రెబ్బలు
పచ్చిమిర్చి- రెండు
సోయా సాస్ - ఒకటేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
వెనిగర్- ఒక టీ స్పూన్
లిక్విడ్ కోసం
- మైదా- అరకప్పు
- కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
- మిరియాల పొడి- ఒక టీస్పూన్
- ఉప్పు-తగినంత
- సోయా సాస్- ఒకటీస్పూన్
తయారీ విధానం: చికెన్ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో మైదా మిరియాల పొడి..కార్న్ ఫ్లోర్, ఉప్పు, సోయాసాస్, కొన్ని నీళ్లు పోసుకుని లిక్విడ్ లా చేయాలి. చికెన్ ముక్కలను ఆ లిక్విడ్ లో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత టొమాటోతరుగు, చక్కెర, ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కలపాలి. రెండు నిముషాల తర్వాత సోయా సాస్, వెనిగర్ కలిపి కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. మరో రెండు నిమిషాల తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి చిక్కబడేవరకు ఉంచాలి . తర్వాత అందులో వేగించిన చికెన్ వేసి గ్రేవీకి పట్టేలా కలపాలి. మూడు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలతో గార్నిష్ చేయాలి.
కీమా కబాబ్స్ తయారీకి కావలసినవి
- కీమా - అరకేజ్
- ఉల్లిగడ్డ – ఒకటి
- పచ్చిమిర్చి - మూడు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండుస్పూన్లు
- కొత్తిమీర తరుగు- మూడు టేబుల్ స్పూన్లు
- కారం - ఒక టీస్పూన్
- ఇలాచీ- ఆరు
- గరం మసాలా- ఒక టీ స్పూన్
- ఉప్పు - తగినంత
- నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్
- చాట్ మసాలా- ఒక టీస్పూన్
- పచ్చి బొప్పాయి పేస్ట్ - మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా గట్టిగా పిండాలి. ఒక గిన్నెలో కీమా, ఉల్లిగడ్డ. పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లులి పేస్ట్ ఉప్పు, పసుపు, కారం ఇలాచీ పొడి, గరం మసాలా, నిమ్మరసం, చాట్ మసాచా, కొత్తిమీర తరుగు.. పచ్చిబొప్పాయి పేస్ట్ వేసి బాగా కలపాలి. దీన్ని ఒకగంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి సీకుకు గుచ్చాలి ఈ సీకులను బొగ్గుల పొయ్యిపై దోరగా కాల్చాలి. ఈ కబాబ్స్ ను పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్ తింటే బాగుంటాయి.
–వెలుగు,లైఫ్–
