రంగారెడ్డి: రాజేంద్రనగర్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర సందడి నెలకొంది. పార్కు ఆవరణంతోపాటు పార్కులోపల పర్యాటకులు కిటకిటలాడుతున్నారు. పులులు, సింహాలు, ఏనుగులు ఇలా రకరకాల అడవి జంతువులతో సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్కూల్స్ , కాలేజీలకు బంద్ ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి పెద్దఎత్తున చిన్నలు, పెద్దలు జూపార్క్ ను సందర్శించారు.
వరుసగా రెండు మూడు రోజులు సెలవులు ఉండటంతో డైలీ దాదాపు 20 వేల మంది పర్యాటకులు జూపార్క్ కు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సిటీ, సిటీ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు వివిధ జిల్లాలనుంచి భారీగా పబ్లిక్ తరలివచ్చారు. ప్రత్యేక బస్సుల్లో జూపార్క్ ను విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే జంతువులను అందరూ చూసి ఆనందపడుతూ ఉంటారు.
ఇక వీకెండ్స్‌లో అయితే సందర్శకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సింహాలు, పులులు, పాములు, ఏనుగులు లాంటి అనేక జంతువులు మనం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో చూడవచ్చు. అయితే త్వరలో మరికొన్ని కొత్త జంతువులు కూడా ఈ పార్క్‌లో సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేయనున్నాయి.
