OTT Movie: పిచ్చి ప్రేమ.. హార్ట్‌బ్రేక్ కథతో.. ఓటీటీలో దూసుకెళ్తోన్న కొత్త సినిమా

OTT Movie: పిచ్చి ప్రేమ.. హార్ట్‌బ్రేక్ కథతో.. ఓటీటీలో దూసుకెళ్తోన్న కొత్త సినిమా

బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దీవానే కి దీవానియత్’ (Ek Deewane Ki Deewaniyat). ఈమూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జీ5 మరియు నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్స్లో అందుబాటులో ఉంది. లవ్ & ఎమోషన్ రొమాంటిక్ జానర్లో మిలాప్ మిలన్ జవేరి మూవీ తెరకెక్కించాడు. హీరో హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సోనమ్ బాజ్వాల నటన ప్రేక్షకుల్ని వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేమా.. ద్వేషమా? అన్న కోణంలో సాగిన విధానం సినిమాకు బలంగా నిలిచింది. 

కథేంటంటే:

విక్రమాదిత్య భోంస్లే (హర్షవర్ధన్ రాణే) ఒక పవర్‌‌‌‌ఫుల్ పొలిటీషియన్ కొడుకు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న యువ రాజకీయ నాయకుడు. కావాల్సింది ఏదైనా సాధించుకునే స్వభావం అతనిది. ‘‘కావాల్సింది దక్కించుకో. దక్కించుకోలేకపోతే ధ్వంసం చెయ్‌‌‌‌” అని తండ్రి చెప్పిన మాటలను తు.చా. తప్పకుండా పాటించే వ్యక్తి.

►ALSO READ | Thalapathy Vijay: విజయ్ కీలక ప్రకటన.. జన నాయగన్ సినిమానే ఆఖరి మూవీ.. అధికారికంగా ప్రకటించిన తలపతి

విక్రమాదిత్య ఒకసారి లేడీ సూపర్ స్టార్, యాక్టర్‌‌‌‌‌‌‌‌ అదా (సోనమ్ బజ్వా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ.. అదా మాత్రం విక్రమాదిత్యను ఇష్టపడదు. దాంతో అతని ప్రేమ కాస్త అమితమైన వ్యామోహంగా మారుతుంది. అందుకే అదా అనుమతి తీసుకోకుండానే ఆమెని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని పబ్లిక్​గా ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అనేది మిగతా కథ.