హైదరాబాదీలు ఎంతగానో ఇష్టపడే నుమాయిష్ ఎగ్జిబిషన్ సందడి మొదలవుతోంది. 2026 కొత్త సంవత్సరం పురస్కరించుకుని జనవరి 1 నుంచే నుమాయిష్ ప్రదర్శనలు ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తయారైన వస్తువులు, కళాకృతులు, చిన్న తరహా పరిశ్రమలలో తయారైన సామాగ్రిని ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. 85వ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాట్లు పై నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
ఎగ్జిబిషన్ పూర్తి వివరాలు:
- జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అల్ ఇండియా ఇండ్రస్టీయల్ ఎగ్జిబిషన్
- 45 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్
- వివిధ రాష్ట్రాల నుంచి సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల వారు స్టాల్స్ ఏర్పాటు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేత ఎగ్జిబిషన్ ప్రారంభం
- ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఎగ్జిబిషన్
- ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా ఎగ్జిబిషన్ కమిటీ నిర్ణయం
- 5 ఏళ్ల లోపు ఉన్న వారికి ఎంట్రీ ఫీజు ఉండదు
- స్టాల్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఫైర్ లాంటి విషయాల్లో పకడ్బందీగా చర్యలు
- 106 మంది సెక్యూరిటీ సిబ్బంది,360 మంది వాలంటీర్లు
- సీసీ టీవీ, మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు
- 1050 స్టాళ్లు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు
- ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు
- ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటులో మహిళలకు ప్రాధాన్యత
- మొత్తం 19 విద్యా వ్యవస్థలను నడుపుతోంది ఎగ్జిబిషన్ సొసైటీ
- దాదాపు 80 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన నుమాయిష్
- హైదరాబాద్ నగరంలో జరుగుతున్న నుమాయిష్ దేశంలోనే అతి పెద్దది
- ప్రతి సంవత్సరం నుమాయిష్ కు పెరుగుతున్న సందర్శకులు
