అవన్నీ పుకార్లే.. గంభీరే ఉంటడు: టెస్ట్ కోచ్ మార్పు వార్తలపై తెగేసి చెప్పిన BCCI

అవన్నీ పుకార్లే.. గంభీరే ఉంటడు: టెస్ట్ కోచ్ మార్పు వార్తలపై తెగేసి చెప్పిన BCCI

న్యూఢిల్లీ: భారత టెస్ట్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‎ను తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కోచ్ మార్పు వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. టెస్ట్ కోచ్‎గా గంభీర్‎ను తొలగిస్తారని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. 

రెడ్-బాల్ కోచింగ్ సెటప్‌లో మార్పు గురించి బీసీసీఐ ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా హెడ్ కోచ్‎గా గంభీర్ కొనసాగుతాడని తేల్చిచెప్పారు. టెస్ట్ కోచ్ కోసం గంభీర్ స్థానంలో బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదని వివరించారు. కాగా, స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో రెడ్ బాల్ కోచ్ పదవి నుంచి గంభీర్‎ను తొలగించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

►ALSO READ | సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌: ఫైనల్లో సాత్విక్‌‌‌‌–రాధిక

గంభీర్ స్థానంలో తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‎ను టెస్ట్ కోచ్‎గా నియమించనున్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోచ్ మార్పు వార్తలు పుకార్లేనని బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ ఇవ్వడంతో ప్రచారానికి చెక్ పడింది. టెస్ట్ కోచ్‌గా గంభీర్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడింది.