సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌: ఫైనల్లో సాత్విక్‌‌‌‌–రాధిక

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌: ఫైనల్లో సాత్విక్‌‌‌‌–రాధిక

విజయవాడ:  సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో  తెలంగాణ షట్లర్‌‌‌‌‌‌‌‌ సాత్విక్ రెడ్డి..  - రాధిక శర్మతో  మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌ ఫైనల్ చేరి టైటిల్ ముంగిట నిలిచాడు. శనివారం జరిగిన  సెమీఫైనల్లో రెండో సీడ్  సాత్విక్ (తెలంగాణ)–రాధిక (పంజాబ్‌‌‌‌) జోడీ  21–-13, 21–-14తో నితిన్ కుమార్‌‌‌‌‌‌‌‌–-కనిక కన్వాల్‌‌‌‌ను ఓడించింది. మరో మ్యాచ్‌‌‌‌లో  టాప్ సీడ్ అషిత్ సూర్య-– అమృత ద్వయం 8-–21, 21–-18, 21–-18తో దీప్ రాంభీయ–- సోనాలి మిర్కెల్కర్‌‌‌‌పై గెలిచింది. 

విమెన్స్ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో లోకల్ ప్లేయర్ తామిరి సూర్య చరిష్మ  21-–18, 18–-21, 21–-9 తో   45వ ర్యాంకర్ రక్షిత శ్రీ (తమిళనాడు)ని,  తన్వీ పత్రి 18–-21, 21–-12, 21-–15తో శృతి ముందడ (మహారాష్ట్ర)ను ఓడించి ఫైనల్ చేరారు. మెన్స్ సింగిల్స్‌‌‌‌లో ఒడిశా మాస్టర్స్ విజేత రిత్విక్ (తమిళనాడు)  ఓ మ్యాచ్ పాయింట్‌‌‌‌ను కాపాడుకుని 21–-16, 17–-21, 22–-20తో టాప్ సీడ్ కిరణ్ జార్జ్‌‌‌‌ను ఓడించాడు . మరో మ్యాచ్‌‌‌‌లో భరత్ రాఘవ్ 21–-17, 11–-21, 21–-11తో తెలంగాణ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, రెండో సీడ్ మన్నేపల్లి తరుణ్‌‌‌‌కు షాకిచ్చాడు. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో శిఖ గౌతమ్ –- అశ్విని భట్,  ప్రియా దేవి–  శృతి మిశ్రా జోడీలు ఫైనల్లో అడుగు పెట్టాయి.