ఇండిగో విమానంపై లేజర్ లైట్.. శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్

ఇండిగో విమానంపై లేజర్ లైట్.. శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం గాల్లో ఉండగానే లేజర్ లైట్ ఫోకస్  పైలట్లపై పడింది. దీంతో  పైలట్లు కొంత గందరగోళానికి గురయ్యారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. దీంతో ఏటీసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. కోల్ కతానుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ఇండిగో విమానం.. మరికొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందన్న సమయంలో విమానం కాక్ పిట్ లోకి లేజర్ లైట్ ఫొకస్ చొచ్చుకుపోయింది.. దీంతో పైలట్లు ఇబ్బందిపడ్డారు. 

ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్టు అధికారులకు చెప్పారు. భద్రతా సమస్యగా గుర్తించిన అధికారులు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందో  లేజర్ లైట్లు ఎక్కడినుంచి పడ్డాయి.. దీనివెనక ఏదైనా భద్రతా పరమైన రిస్క్ ఉందా అనే కోణంగా విచారణ చేపట్టారు.