Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షోలపై సస్పెన్స్.. మెగా ఫ్యాన్స్‌కు నిరాశేనా?

Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షోలపై సస్పెన్స్.. మెగా ఫ్యాన్స్‌కు నిరాశేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ప్రీమియర్ షోలపై సస్పెన్స్ ?

సాధారణంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం ఆనవాయితీ. మార్చి 18 రాత్రి నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ఉంటాయని అందరూ భావిస్తుంటారు. కానీ ప్రీమియర్ షోలను స్కిప్ చేయాలిన మేకర్స్ భావిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి బదులుగా, మార్చి 19 తెల్లవారుజామున 5 గంటల నుండే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా చిత్ర యూనిట్ దీనిపై స్పందించనప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మెగా అభిమానుల్లో కాస్త కలవరాన్ని రేపుతోంది.

ALSO READ : త్రిషపై పార్తిబన్ సెటైర్లు.. 

డబ్బింగ్ పనిలో పవన్!

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన డబ్బింగ్ పార్ట్ మొత్తాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారని సమాచారం. అటు సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలో పాటలకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) బాణీలు అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

త్వరలో ట్రైలర్ బ్లాస్ట్!

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.  అతి త్వరలోనే ఒక సాలిడ్ ట్రైలర్‌ను వదిలేందుకు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, హరీష్ శంకర్ మార్క్ డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేటాయించిన సమయం, సినిమా అవుట్‌పుట్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .